: సీఎం కేసీఆర్ ను కలిసి... రూ.50 లక్షలిచ్చిన డాక్టర్ సోమరాజు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేర్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ సోమరాజు కలిశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని అందజేశారు. మాసాయిపేట ఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు ఆ డబ్బును వినియోగించాలని సోమరాజు కోరారు.