: ఉత్తరాఖండ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం
పరాజయ భారంతో కుంగిపోయిన కాంగ్రెస్ కు మూడు నెలల తర్వాత ఉత్తరాఖండ్ ఉపఎన్నికల రూపంలో స్వల్ప ఊరట కలిగింది. ఈ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించింది. పోటీచేసిన మూడు చోట్ల కాంగ్రెస్ నేతలే గెలిచారు. ధార్చుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ బీజేపీ అభ్యర్థి బీడీ జోషీపై 19వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.