: విజయవాడలో కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుమారు రూ. 140 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. మొత్తం ఖర్చులో రూ. 120 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మిగతా రూ. 20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలకు సమీపంలో ఓ దాత ప్రభుత్వానికి దానం చేసిన 10 ఎకరాలలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. హైదరాబాద్ లోని మెహదీ నవాజ్ జంగ్ కేన్సర్ ఆసుపత్రి మాత్రమే ఇప్పటివరకు కేన్సర్ రోగులకు ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా ఎంఎన్ జె ఆసుపత్రి సేవలు ఇకపై తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో, కేన్సర్ ఆసుపత్రిని విజయవాడలో త్వరితగతిన నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని తొందరగా అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News