: మేకను పట్టుకోండి... పదివేలు పట్టుకెళ్లండి!
'మేకను పట్టుకోండి... పదివేలు పట్టుకెళ్లండి' అంటూ బంపర్ ఆఫరిస్తున్నారు పశ్చిమ బెంగాల్ లోని హవేరి జిల్లాలోని నెగలూర్ గ్రామస్థులు. అసలు కథ ఏమిటంటే... నెగలూర్ గ్రామంలోని మసీదుకు 11 ఏళ్ల క్రితం కొందరు భక్తులు ఓ మేకను కానుకగా ఇచ్చారు. అప్పటి నుంచి గ్రామస్థులు మేకను అభిమానంగా చూసుకుంటున్నారు. పండుగలు, మత కార్యక్రమాల్లో కూడా దీనిదే ప్రత్యేక ఆకర్షణ. అలాంటి మేక అకస్మాత్తుగా ఒకరోజు కనబడకుండా పోయింది. మేక కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టారు. కానీ మేక జాడ కానరాలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో మేక దొరికితే అప్పగించాలంటూ పోస్టర్లు కూడా వేయించారు. అప్పగించిన వారికి 10 వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని వారు పేర్కొన్నారు. ఓ మేక కోసం గ్రామస్థులు పడుతున్న తపన అందర్నీ కదిలిస్తోంది.