: లిబియాలో భారత కుటుంబం అపహరింత
అల్లర్లతో అట్టుడికే లిబియాలో భారత కుటుంబం అపహరింతకు గురైంది. కారులో రాజధాని ట్రిపోలికి వెళుతుండగా వారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు సమాచారం. అయితే, ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయాలు తెలియరాలేదు. వారం రోజులుగా లిబియాలోని మిలిటెంట్ గ్రూపుల మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. ముఖ్యంగా ట్రిపోలి, బంఘాజి నగరాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది.