: ఏపీలో పదకొండు జిల్లాల మీదుగా బుల్లెట్ రైలు


ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే బుల్లెట్ రైలు వచ్చే అవకాశముంది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా ఈ రైలు రానుంది. ఈ క్రమంలో రాయలసీమలో రెండు జిల్లాలు, కోస్తాలో తొమ్మిది జిల్లాల మీదుగా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపడతారు. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబయి మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అంగీకరించిన కేంద్రం... రానున్న ఐదేళ్లలో చతుర్భుజి కారిడార్ చుట్టూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ సర్కారు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే రాష్ట్రం పారిశ్రామికంగా, పట్టణికీకరణలో వేగంగా అభివృద్ధి చెందుతుంది.

  • Loading...

More Telugu News