: ధనుష్ బతికే ఉన్నాడు
మృతదేహాల అప్పగింతలో అధికారుల పొరబాటుతో అందరూ చనిపోయాడని భావించిన చిన్నారి ధనుష్ బతికే ఉన్నాడు. ప్రస్తుతం అతడు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాసాయిపేట ఘటనలో ధనుష్ చనిపోయాడంటూ అధికారులు ఇస్లాంపూర్ కు చెందిన దత్తు అనే విద్యార్థి మృతదేహాన్ని అప్పగించారు. అది తమ బిడ్డ మృతదేహమేననుకున్న వారు అంత్యక్రియలు జరిపారు. అయితే, ధనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న వార్తతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటీన సికింద్రాబాద్ వెళ్ళారు. చికిత్స పొందుతున్నది తమ కుమారుడేనని నిర్ధారించుకుని ఆనందభాష్పాలు రాల్చారు.