: శివసేనకు వ్యతిరేకంగా దర్శకుడు మహేష్ భట్ నిరసన


ముంబయిలోని మహారాష్ట్ర సదన్ లోని ఓ క్యాంటిన్ లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ అక్కడున్న ముస్లిం వ్యక్తికి శివసేన ఎంపీ బలవంతంగా చపాతీ తినిపించడంపై పలువురి నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ ఈ ఘటనకు వ్యతిరేకంగా ముంబయిలో పలువురితో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఘటనను ఖండించిన భట్, స్వేచ్ఛ లేకుంటే దేశం ప్రగతి పథంలో నడవదని... మానవత్వం కనుమరుగైతే ఎంత అభివృద్ధి సాధించినా ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటనపై తప్పకుండా విచారణ జరగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News