: హామీలను విస్మరించి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు: పొన్నాల


తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. కేసీఆర్ పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లోనే అన్నదాతలు పెద్ద ఎత్తున ఆత్మహత్మలు చేసుకున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News