: రాజధానిపై రిఫరెండం నిర్వహించాలి: వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో రిఫరెండం (ప్రజాభిప్రాయసేకరణ) జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అంశంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ సర్కారు పూర్తికాలం కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు, డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాల్లో ఎంత మేర మాఫీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. అధికారం కోసం ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇష్టారీతిలో హామీలిచ్చారని, తీరా అమలు విషయానికొచ్చేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.