: తెలంగాణ రాష్ట్ర పౌరులకు స్మార్ట్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర పౌరులకు త్వరలోనే స్మార్ట్ కార్డులు జారీచేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ కార్డు ద్వారా బహుళ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వ పథకాల ఫలాలు నిజమైన లబ్దిదారులకు అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్డులు ప్రవేశపెడుతోంది. ఇంటింటికి తిరిగి ఈ స్మార్ట్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా, కొత్త రేషన్ కార్డుల జారీకి పాస్ పోర్ట్ తరహా వెరిఫికేషన్ నిర్వహించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. అంతేగాకుండా, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర లోగో ఉన్న కొత్త కార్డులను అందించేందుకు కసరత్తులు చేస్తోంది.