: అమర్ నాథ్ యాత్రికులకు 'టెర్రర్' హెచ్చరిక
ప్రస్తుతం ఉత్తరాదిన అమర్ నాథ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఉగ్రవాద హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాత్రపై టెర్రరిస్టులు దాడులకు దిగే అవకాశాలున్నాయని, ఈ మేరకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు ఈ వివరాలను లోక్ సభలో వెల్లడించారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన నాటి నుంచి కాశ్మీర్లోని గందేర్ బాల్ జిల్లాలో వాహనాలపై రాళ్ళు రువ్విన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని రిజ్జు తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించామని ఆయన పేర్కొన్నారు.