: 'కామన్వెల్త్' జూడోలో భారత్ కు మూడు పతకాలు
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జూడో క్రీడాంశంలో మూడు పతకాలు కైవసం చేసుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో నవ్ జోత్ చనా, మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా లిక్మబామ్ రజతాలు గెలుచుకున్నారు. ఇక, మహిళల 52 కిలోల విభాగంలో కల్పనా తౌడమ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో, తొలిరోజు భారత్ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరాయి. వెయిట్ లిఫ్టింగ్ అంశంలో భారత్ కు నాలుగు పతకాలు లభించిన సంగతి తెలిసిందే. వాటిలో రెండు పసిడి పతకాలున్నాయి.