: ఆస్ట్రేలియాలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు
ఆస్ట్రేలియాలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ పదవీకాలం రెండు సంవత్సరాలు. ఈ కమిటీ అధ్యక్షుడిగా ముత్తవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా బాలకృష్ణ కొండేయపాటి, ట్రెజరర్ గా అజిత్ కుమార్ వీరపనేని, కార్యదర్శిగా నరేశ్ వెలగపూడి, సంయుక్త కార్యదర్శిగా వసంత్ గుట్ట ఎన్నికైనట్టు ఆస్ట్రేలియాలో తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ కల్యాణ్ బొడ్డులూరి తెలిపారు.