: స్కూలు బస్సులు తనిఖీలు చేస్తాం: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి
మాసాయిపేట బస్సు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్సుల కండిషన్ తనిఖీలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అన్ని స్కూలు బస్సుల కండిషన్ తనిఖీలు చేస్తామని అన్నారు. విద్యార్థుల ప్రాణాలు ఫణంగా పెట్టి విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను నడిపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రమాదాలు జరిగిన తరువాత కంటే ప్రమాదాలు జరగకముందే అప్రమత్తమవడం మంచిదనే ఉద్దేశంతో తనిఖీల నిర్వహణకు పూనుకున్నామని ఆయన వెల్లడించారు.