: ఆ బస్సులో ఉన్న చిన్నారుల లెక్క తేలింది


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో ఎంతమంది చిన్నారులున్నారన్న దానిపై స్పష్టత వచ్చింది. బస్సులో మొత్తం 36 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలిలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వీరితో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. వారి పేర్లను కూడా కలెక్టర్ వెల్లడించారు. మరో ఇద్దరు పిల్లలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. మరో 20 మంది చిన్నారులు సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ బస్సులో 36 మంది విద్యార్థులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  • Loading...

More Telugu News