: బాలనేరస్థుల వయసు తగ్గించే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తుంది: రాజ్ నాథ్ సింగ్
దేశంలో మహిళలు, యువతులపై పెరిగిపోతున్న అత్యాచారాల నేపథ్యంలో బాలనేరస్థుల వయసును తగ్గించాలని కేంద్ర మహిళ, పిల్లల అభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న బాలనేరస్థుల 18 ఏళ్ల వయసును పదహారుకు చేయాలన్నది ఆలోచన. ఇటీవల ఎక్కడ చూసినా పద్దెనిమిదేళ్ల లోపు యువకులే ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సంబంధిత మంత్రి మేనకాగాంధీ దానికి సంబంధించిన సిఫార్సు ఫైళ్లను కేంద్రానికి పంపినట్లు సమాచారం. దీనిపై లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, బాలనేరస్థుల వయసును తగ్గించే విషయంపై జువెనైల్ జస్టిస్ చట్టం కింద ప్రభుత్వం పరిశీలిస్తుందని క్వశ్చన్ అవర్ లో చెప్పారు. అందరినీ సంప్రదించే ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు.