: క్షతగాత్ర బాలలను పరామర్శించిన పవన్ కల్యాణ్


ఎన్నికల తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి బయటకు వచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులైన పసివారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు శ్రద్ధ చూపితే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని అన్నారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పసివారి హృదయవిదారక యాతన చూస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. మరో 12 గంటలు గడిస్తే కానీ క్షతగాత్రుల పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారని పవన్ కల్యాణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News