: తీహార్ ఖైదీలు నడిపిస్తున్న రెస్టారెంటుకు ప్రశంసలు


ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు ఏర్పాటు చేసిన ఏసీ రెస్టారెంటు పలువురి ప్రశంసలు అందుకుంది. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఈ రెస్టారెంటుకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నారు. కస్టమర్లను చిరునవ్వుతో ఆహ్వానించడం దగ్గర్నించి వారు ఆర్డర్ చేసినవి ఓపిగ్గా సప్లయి చేయడం వరకు తమ బాధ్యతలను సమర్థంగా పోషిస్తున్నారట. పశ్చిమ ఢిల్లీలోని తీహార్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంటు లోపలి భాగం అందరినీ ఆకట్టుకుంటోంది. 50 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ రెస్టారెంట్ లో ఖరీదైన ఫర్నిచర్ వినియోగించారు. ఇక్కడ లంచ్ చేసిన గౌరవ్ గుప్తా అనే బ్యాంకర్ మాట్లాడుతూ, ఆహారం యావరేజిగా ఉందని, అయితే ఆరోగ్య రీత్యా ఎంతో శ్రేష్ఠంగా ఉందని, పరిశుభ్రతకు పెద్దపీట వేశారని కితాబిచ్చారు. రోజుకు 50 మంది కస్టమర్లు వస్తున్నారని రెస్టారెంట్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న మహ్మద్ అసీం తెలిపారు. కాగా, ఈ రెస్టారెంట్ లో పనిచేసినందుకు ఖైదీలకు రోజుకు 74 రూపాయలు గిట్టుబాటవుతాయి. ఇక్కడ అందించే డీలక్స్ థాలి వంటకం రేటు రూ.150 కాగా, అత్యంత చవకైనది సమోసా (రూ.10) అట.

  • Loading...

More Telugu News