: శ్రీకాకుళంలో ఏసీబీ దాడులు


శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామునే మొదలైన ఈ దాడుల్లో భాగంగా వేర్వేరు శాఖలకు చెందిన ఇద్దరు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిన్న నీటి పారుదల శాఖలో ఏపీడీగా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖలో డీసీటీఓగా వ్యవహరిస్తున్న అనసూయలకు చెందిన ఇళ్లను ఏసీబీ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ ఇద్దరు అధికారులు అన్నాచెల్లెళ్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరి ఇళ్లతో పాటు వీరి బంధువులకు సంబంధించిన ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఏసీబీ ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామునే మొదలైన ఈ సోదాల్లో వెలుగుచూసే వివరాలు సాయంత్రానికి గాని బహిర్గతం కావు.

  • Loading...

More Telugu News