: దసరా నుంచి 'కల్యాణ లక్ష్మి' పథకం ప్రారంభం


'కల్యాణ లక్ష్మి' పథకాన్ని ఈ దసరా నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళిత, గిరిజన కుటుంబాల్లోని పేద అమ్మాయిల వివాహానికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో కేసీఆర్ ఈ 'కల్యాణ లక్ష్మి' పథకానికి రూపకల్పన చేశారు. దీని ప్రకారం దళిత, గిరిజన కుటుంబాల్లోని అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాక... పెళ్లి కుదిరితే 50 వేల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆర్థిక సహాయం కావల్సిన కుటుంబం... దరఖాస్తుతో పాటు పెళ్లి పత్రికను కూడా జోడించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News