: మావోయిస్టుల ఊచకోతకు ప్రతీకారం తీర్చుకున్న జవాన్లు
2011 మార్చిలో ఛత్తీస్ గఢ్ లోని చింతల్ నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆయుధాలతో విరుచుకుపడ్డారు. 70 మందిని ఊచకోత కోశారు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో ఈ ఉదయం కాల్పులు జరిగినట్లు సమాచారం. 9 మంది వరకు మావోయిస్టులను సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్ దళాలు మట్టుబెట్టాయి. మరికొంత మంది మావోయిస్టులూ మరణించినట్లు సమాచారం. దీంతో నాటి ఘటనకు జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. కాగా, సంఘటన ప్రాంతం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.