: మరో రికార్డు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ మెట్రో


ఢిల్లీ మెట్రోరైలు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒకే రోజు అత్యధిక (2.6 మిలియన్) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన మెట్రోరైలు వ్యవస్థగా రికార్డు పుటలకెక్కిందని ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఒకరోజు అత్యధికంగా 26 లక్షల 84 వేల 132 మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చిన మెట్రో రైల్వే వ్యవస్థగా గత ఆగస్టు 19న 26,50,635 మంది ప్రయాణికులతో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించింది. ఢిల్లీ నుంచి నోయిడాకు 10,09,276 మంది ప్రయాణికులు ప్రయాణించినట్టు మెట్రోరైల్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News