: ప్రకృతితో పందెమేసి ఓడిపోయిన యువకుడు
ప్రకృతితో ఎవరూ పందెం వేయకూడదని చెప్పేందుకు నిదర్శనం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రకృతి విపత్తు క్షణాల్లో ఎలా కమ్మేస్తుందో ఈ సంఘటన తెలిపింది. ఉత్తర భారతదేశంలో గత వారం రోజులుగా వర్షాలు పోటెత్తుతున్నాయి. వరద ప్రవాహం ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. మధ్యప్రదేశ్ లోని బైతుల్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడు చూస్తుండగా నీటిమట్టం పెరుగుతూ పరుగులు తీస్తోంది. వరద వచ్చేలోపు నదిని దాటేయొచ్చని భావించాడా వాహనదారు. అంతే, బైక్ పై జాగ్రత్తగా నది దాటడం ప్రారంభించాడు. ఇంతలో ఉప్పెనలా వచ్చిన వరద ప్రవాహానికి బైక్ తో పాటు పక్కనే ఉన్న చప్టా కిందికి దొర్లిపోయాడు. అతడి వాహనం కిందికి తోసేంతవరకు నెమ్మదిగా వచ్చిన వరద ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో వాహనదారుడు అందరూ చూస్తుండగా బైక్ తో సహా కొట్టుకుపోయాడు.