: కడప, వరంగల్ లలో విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
దేశవ్యాప్తంగా 50 చవక విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. తిరుపతి, విశాఖ విమానాశ్రయాలను ఆధునికీకరిస్తామని, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతామని చెప్పారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కడప, వరంగల్ లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ వివరాలను ఈ రోజు ఆయన లోక్ సభలో వెల్లడించారు.