: ఒక భారత సైనికుడిని చంపితే పదిమంది పాక్ సోల్జర్లను చంపాలి: శివసేన
భారత్, పాకిస్థాన్ మధ్య సమస్యాత్మకంగా ఉన్న సంబంధాన్ని చర్చల ద్వారా సావధానంగా పరిష్కరించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, రెండు దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని శివసేన వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "రెండు దేశాల మధ్య ఎలాంటి చర్చలు లేవు. ఒకవేళ పాక్ ఒక భారత సైనికుడిని చంపితే పదిమంది పాక్ సైనికులను తప్పకుండా చంపాలి" అని అన్నారు.