: దంపతుల పండంటి సంసారానికి కామసూత్ర అప్లికేషన్
భారతీయ పురాతన శృంగార శాస్త్రంగా కామసూత్రకు పేరుంది. ఇందులో దంపతుల పండంటి సంసారానికి ఎన్నెన్నో చిట్కాలు, సలహాలు, భంగిమల వివరాలు ఎన్నో పొందుపరిచారు. వీటిని ఆధారంగా చేసుకుని పలు వీడియోలు కూడా వచ్చాయి. తాజాగా ఒక 3డి అప్లికేషన్ కూడా విడుదల అయింది. శృంగార భంగిమలను 3డి చిత్రాలలోకి మార్చి ఒక అప్లికేషన్ గా తయారు చేశారు. ఇది స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు అనువైనదని బ్రిటిష్ మీడియా పేర్కొంది. లండన్ కు చెందిన ఎగ్జైట్ బుక్స్ డైరెక్టర్ హాజల్ కుషన్ మాట్లాడుతూ.. రెండువేల ఏళ్లుగా కామసూత్ర దంపతులు తమ మధ్య ప్రేమను ఎలా పండించుకోవచ్చో తెలియజేసే గైడ్ గా పనిచేస్తోందని చెప్పారు.