: సచిన్, రేఖ... పేరు గొప్ప ఊరు దిబ్బ!


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ అంటే తెలియనివారు భారతదేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రీడల ద్వారా ఒకరు, సినిమాల ద్వారా మరొకరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సచిన్ రిటైర్ అయిన సందర్భంతో పాటు, అంతకు ముందు చాలా సార్లు ఇంటర్వ్యూలలో, దేశ ప్రజలు తనపై చూపిన అభిమానానికి ఏం చేసి రుణం తీర్చుకోగలను? అంటూ వ్యాఖ్యలు చేసి... అభిమానుల్లో లేనిపోని ఆశల్ని రేకెత్తించారు. అలాగే సినీ నటి రేఖ కూడా అభిమానుల రుణం తీర్చుకుంటానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వీరి అభిలాషకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం వీరికి రాజ్యసభలో స్థానం కల్పించింది. ప్రజలకు ఏదో ఒకటి చేయాలనుందంటూ బీరాలు పలికిన వీరిద్దరూ సభకు హాజరు కావడమే మర్చిపోయారు. సచిన్ కేవలం మూడు రోజులపాటు మాత్రమే రాజ్యసభ సమావేశాలకు హాజరుకాగా, రేఖ ఏడు రోజులు మాత్రమే రాజ్యసభకు హాజరయ్యారు. వీరి కంటే ప్రముఖ సినీ రచయిత జావెద్ అఖ్తర్ చాలా రోజులు సభకు హాజరై మౌనముని ముద్రదాల్చారు. దీంతో వీరిపై జాతీయ మీడియా స్పందిస్తూ... పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు వీరి తీరు ఉందని పేర్కొంది.

  • Loading...

More Telugu News