: నిర్భయకు భారత పుత్రిక అవార్డు
ఢిల్లీ నడివీధులలో రాక్షస మూక చేతిలో బలైపోయిన జ్యోతిసింగ్ అలియాస్ నిర్భయకు భారతపుత్రిక అవార్డుతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాళి అర్పించారు. ఢిల్లీలో జరిగిన ఎన్ డిటివి ఇండియన్స్ ఆఫ్ ధ ఇయర్ అవార్డుల కార్యక్రమంలో నిర్భయ తల్లిదండ్రులకు 'భారత పుత్రిక' అవార్డును ప్రదానం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఆమె మరణం వృధా కాబోదన్నారు. ఆమె మనందరికీ స్ఫూర్తి అన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం పనిచేస్తామని చెప్పారు.