: అంధుల పాఠశాల ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్ హెచ్ఆర్సీ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంధుల పాఠశాల ఘటనను జాతీయ మానవహక్కుల సంఘం సుమోటోగా తీసుకుంది. నాలుగు వారాల్లోగా ఘటనపై సమాధానం ఇవ్వాలని ప్రధాన కార్యదర్శికి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. కాకినాడలోని గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాలలో అల్లరి చేస్తున్నారంటూ ముగ్గురు విద్యార్థులను పాఠశాల నిర్వాహకుడు, ప్రిన్సిపాల్ కలసి చితకబాదారు. నిన్న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది.