: అంగారక గ్రహానికి మరింత చేరువలో మామ్
అంగారక గ్రహంపైకి భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (మామ్-మంగళ్‌యాన్) వ్యోమనౌక తన గమ్యానికి మరింత చేరువైంది. తన ప్రయాణంలో దాదాపు 80 శాతాన్ని మామ్ పూర్తి చేసింది. ఇప్పటివరకు 540 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 24న మామ్ అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది.