: స్థానికులెవరో తెలంగాణ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది: మంత్రి జగదీశ్ రెడ్డి
ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన స్థానికత అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నిన్న (సోమవారం) తప్పుబట్టిన సంగతి తెలిసిందే. చట్టాలే దాన్ని నిర్ణయిస్తాయన్నారు. ఈ మాటలపై తాజాగా టీ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణలో స్థానికత అంశంపై ఏపీ ప్రభుత్వానికి అవసరమేంటి? అని ప్రశ్నించారు. తమ హక్కులు, అవకాశాల కోసమే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారని, ప్రజల హక్కులను తమ సీఎం కాపాడతారనీ అన్నారు. అయినా విద్యార్థులను మోసగిస్తోంది తాము కాదని... ఏపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.