: దేవుడు కూడా రేపుల్ని ఆపలేడు: యూపీ గవర్నర్
ఉత్తరప్రదేశ్ లో అరాచకత్వంపై ఇప్పటివరకు సమాజ్ వాదీ పార్టీ నేతల బాధ్యతారాహిత్య ప్రకటనలు చూశాం. ఇప్పుడు యూపీ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన అజీజ్ ఖురేషి కూడా వారి సరసన చేరారు. రాజ్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఖురేషి తీవ్ర వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతుండడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఆ దేవుడు దిగివచ్చినా అత్యాచారాలను నిరోధించలేడని సెలవిచ్చారు. అంతేగాకుండా ప్రపంచంలో ఉన్న పోలీసులను అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినా రేపుల పర్వం ఆగదని తన అమూల్య అభిప్రాయం వెలిబుచ్చారు. అయినా, యూపీ సర్కారు శాంతిభద్రతల కోసం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఖురేషి పేర్కొన్నారు.