: టెన్షన్ పడుతున్నారా ... అయితే మంచిదే లెండి!
మరక మంచిదే! అన్న టీవీ ప్రకటన లాగా.. టెన్షన్ మంచిదే! అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒత్తిడి అనేది చెడ్డదని అనుకోవడం పెద్ద సమస్య అని రోచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు జెరమీ జామీసన్ పేర్కొన్నారు. కొందరు నలుగురిలోకి రావాలన్నా కూడా టెన్షన్ ఫీలవుతారు. టెన్షన్ భావన రాగానే.. ఏదో కీడు జరుగుందనే ఆలోచనలతో భయపడిపోతారు. కానీ టెన్షన్ పడేవారి సంకేతాలను పాజిటివ్‌గా డైవర్ట్ చేయాలని దీనివలన మంచి ఫలితాలు ఉంటాయని జామీసన్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం నిరూపిస్తోంది.
టెన్షన్‌కు అర్థం ఏంటంటే.. రాబోతున్న క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనడానికి మన శరీరం సన్నద్ధం అవుతున్నట్లుగా భావించాలని జామీసన్ వివరించారు. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు శరీరం.. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమకూర్చుకుంటుందట. కండరాలకు ఎక్కువ రక్తాన్ని పంపిస్తుందట. మెదడుకు మరింత ప్రాణవాయువును చేరవేస్తుందట.