: కాకినాడలో ఎల్ఎన్ జీ టెర్మినల్ ద్వారా ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం: ఏపీ సీఎం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్ జీ టెర్మినల్ కు ప్రభుత్వం తరపున అనుమతి ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్నుంచి ప్రభుత్వానికి రూ.3వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో స్థానికతను నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం కాదని, దానికి చట్టాలున్నాయనీ అన్నారు. ఆర్టికల్ 371-డీ ప్రకారం స్థానికత నిర్ణయిస్తారని తెలిపారు. అటు 2014, మార్చి 31లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని బాబు అన్నారు. ఉల్లి, టమోటా ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి, ఈ ఏడాదిలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని వివరించారు. ఏపీలో మొత్తం 572 మండలాల్లో కరవు ఉందని పేర్కొన్నారు.