: అత్యాచారాలకు కారణమేంటో వివరించిన ఉమాభారతి
ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతుండటంపై కేంద్ర మంత్రి ఉమాభారతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో విలువలు పతనం కావడం వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆమె అన్నారు. వీటిని నియంత్రించడానికి భారతీయ విలువలను తు.చ. తప్పకుండా పాటించడమొక్కటే పరిష్కారమార్గమని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఝాన్సీలో ఉన్న బుందేల్ ఖండ్ విశ్వవిద్యాలయంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.