: అప్పుడే అతడిని ప్రేమించాను: అలియా భట్
యువకుల కలలరాణిగా, అందం, అభినయం కలగలిసిన నటిగా ముద్రవేసుకుంటున్న యువనటి అలియా భట్ పదకొండేళ్ల వయసులో ప్రేమలో పడ్డానని తెలిపింది. వికాస్ బెల్ నిర్మిస్తున్న 'షాందార్' సినిమాలో షాహీద్ కపూర్ కు జోడీగా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, పదకొండేళ్ల వయసులో ముంబైలోని జెయింట్ గెలాక్సీ థియేటర్ లో షాహీద్ కపూర్ నటించిన 'ఇష్క్ విష్క్' సినిమా చూశానని, అప్పుడే అతడితో ప్రేమలో పడిపోయానని చెప్పింది. షాహీద్ కపూర్ కు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. షాహీద్ కపూర్ ను సీనియర్ గా చూడడం లేదని, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రాల సమకాలీనుడిగా చూస్తున్నానని పేర్కొంది. షాహీద్ కపూర్ మంచి నటుడని అలియా కితాబిచ్చింది.