: బ్లడ్‌ షుగర్‌ పెరిగితే ముందుగానే ముసలితనం


బ్లడ్‌ షుగర్‌ ఎక్కువ కావడం వల్ల ముసలితనం ఛాయలు మనుషుల్లో ముందుగానే వచ్చేస్తాయని, తమ అసలు వయసు కంటె ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తారని తాజా అధ్యయనాలు తేలుస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి అనేది వృద్ధాప్య లక్షణాలతో కనిపించడంపై నేరుగా ప్రభావం చూపిస్తుందని ఇందులో తేల్చారు.

ప్రధానంగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారిపై నిర్వహించిన అధ్యయనంలో లీటరు రక్తంలో 1 మిల్లీమోల్‌ షుగర్‌ లెవల్‌కు ఐదు నెలలు అదనపు వృద్ధాప్యం వచ్చినట్లు కనిపించారట. రక్తంలో షుగర్‌ వలన జరిగే గ్లైకేషన్‌ అనే ప్రక్రియతో వృద్ధాప్య ఛాయలకు లింకున్నట్లు తేల్చారట. మొత్తానికి యంగ్‌ గా కనిపించాలంటే చక్కెర తక్కువగా వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News