: సినీ నిర్మాతపై విరుచుకుపడ్డ సిద్ధార్థ్


సినీ హీరో సిద్ధార్థ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమిళ సినిమా జిగర్థాండ (తెలుగులో చిక్కడు దొరకడు) విడుదలను నిర్మాత వాయిదా వేశారు. విడుదలకు గల కారణాలను దర్శకుడు (కార్తీక్), హీరోకు ఆయన వివరించలేదు. దీనిపై సిద్ధార్థ్ కు కోపం ముంచుకొచ్చింది. ట్విట్టర్ వేదికగా ఆయనపై మండిపడ్డారు. "మీరెవరైనా కానివ్వండి... ఇలాంటి చెత్త ఆటలు ఆడకండి. సినిమా విడుదల ఆలస్యం చేసినంత మాత్రాన మమ్మల్ని ఆపలేరు. ఓ మంచి సినిమా విడుదల కాకుండా ఆగడం మంచిది కాదు" అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో 'కార్తీక్, మా జట్టు మొత్తం సినిమా కోసం చాలా కష్టపడింది. మా కష్టం మీద ఆమాత్రం గౌరవం లేకపోతే ఎలా? కనీసం మాతో చర్చించకుండా వాయిదా వేశారు' అంటూ ధ్వజమెత్తారు. ఇదిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. గతంలో కూడా సిద్ధార్థ్ ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News