: విద్యార్థులతో చర్చించడం పోయి లాఠీఛార్జ్ చేయడమా?: మధుయాష్కీ గౌడ్
విద్యార్థులతో చర్చించకుండా లాఠీఛార్జ్ ఎలా చేస్తారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నది న్యాయపోరాటమని అన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఓయూ విద్యార్థుల ఉద్యమానికి మద్దతునిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, విద్యార్థులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.