: హైకోర్టులో న్యాయవాదుల ఆందోళనపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులు చేసిన ఆందోళన కోర్టు ధిక్కారమంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన పిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విభజన ప్రక్రియ పూర్తయినందున విచారణ అవసరం లేదంటూ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కాగా, తెలంగాణ న్యాయవాదుల సమ్మె సమయంలో అప్పటి టీఆర్ఎస్ నేత కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈటెల, నాయిని నర్సింహరెడ్డి, మధుయాష్కీ, విజయశాంతి ప్రదర్శనలిచ్చారని, అది కూడా కోర్టు ధిక్కారమేనని పిల్ లో అడుసుమిల్లి పేర్కొన్నారు.