: మన రక్షణ బడ్జెట్ పెరిగితే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు!


భారత్ తన రక్షణ బడ్జెట్ ను ఈ ఏడాది కాస్త పెంచడంతో అటు పాకిస్థాన్ మీడియాలో ఆందోళన మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ పెంపు కారణంగా రెండు దేశాల మధ్య సమతుల్యతకు ముప్పు వాటిల్లుతుందన్న విషయం పాకిస్థాన్ గమనిస్తుందా? గమనిస్తే ఏం చేస్తుంది? అని దినపత్రిక 'ది నేషన్' తన సంపాదకీయంలో పేర్కొంది. మోడీ ప్రధానిగా వచ్చినప్పటి నుంచి ఇలాంటి చర్యలకు ఊతం వచ్చిందని ఆ పత్రిక విశ్లేషించింది. భారత్ చర్యలకు ప్రతిగా నవాజ్ షరీఫ్ సర్కారు... దేశంలో ప్రధాన సమస్యలైన విద్యుత్, నీటి సంక్షోభం, ప్రజల తరలింపు వంటి అంశాలను పట్టించుకోకుండా ఆయుధపోటీకి సై అంటే... నష్టపోవడం ఖాయమని, సమస్యలు పరిష్కారం కావని 'ది నేషన్' సూచించింది. 1998లో భారత్ ఆపరేషన్ శక్తి పేరిట ఐదు అణుపరీక్షలు చేపడితే, ప్రతిగా షరీఫ్ సర్కారు ఆరు పరీక్షలు నిర్వహించిందని ఆ పత్రిక ఎత్తిచూపింది. ఇప్పుడు కూడా భారత్ తన రక్షణ రంగ బడ్జెట్ పెంచడం చూసి, పాకిస్థాన్ కూడా రక్షణ బడ్జెట్ పెంచరాదని ఆ పత్రిక హితవు పలికింది.

  • Loading...

More Telugu News