: రష్యాపై రగిలిపోతున్న మలేసియా దేశస్థులు
రష్యాపై మలేసియా దేశస్థులు కసి, కోపంతో రగిలిపోతున్నారు. ఎమ్ ఎచ్ 17 దుర్ఘటన తర్వాత రష్యన్ అనుకూల ఉక్రెయిన్ తిరుగబాటుదారులతో పాటు రష్యా దేశంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. మలేసియా ప్రభుత్వంతో పాటు ప్రపంచదేశాలు కూడా రష్యాపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ దేశంలో రష్యా వస్తువులను బ్యాన్ చెయ్యాలని వారు మలేసియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచదేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని కూడా అభిప్రాయపడుతున్నారు మలేసియా... ముస్లిం ప్రాబల్య దేశం. ఎమ్ ఎచ్ 17 దుర్ఘటనలో 43 మంది మలేసియా ముస్లింలు చనిపోయారు. ముస్లిం మతాచారం ప్రకారం చనిపోయిన వారి మృతదేహాలకు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయాలి. అయితే ఇప్పటివరకు తిరుగుబాటుదారులు కనీసం శవాలను సైతం అప్పగించకపోవడంతో మలేసియా వాసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులపై తమ ప్రభుత్వం, ప్రపంచదేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.