: పొడవైన్ హీరోయిన్ ఎవరంటూ స్టాఫ్ సెలక్షన్ కమిటీ పరీక్షలో చిత్రమైన ప్రశ్న!


అప్పుడప్పుడు ప్రభుత్వోద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో తలతిక్క ప్రశ్నలడగడం చూస్తుంటాం. ఇది కూడా ఆ కోవలోకే వస్తుందేమో! అభ్యర్థి సామర్థ్యాన్ని ఇలాంటి ప్రశ్నలతో ఎలా పరీక్షిస్తారో ఏలినవారికే ఎరుక. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్ సీ) నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో ఏ ప్రశ్న అడిగారో చూడండి. ఈ క్రింది వారిలో పొడవైన హీరోయిన్ ఎవరు? అంటూ ఆప్షన్లుగా కత్రీనా, దీపికా పదుకొనే, హుమా ఖురేషి, ప్రీతి జింటాలను పేర్కొన్నారు. అయితే, పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి కాస్త మట్టంగా కనిపించే ప్రీతిని వదిలేసి మిగిలిన ముగ్గురి విషయంలో తలపట్టుకున్నాడట. చివరికి అతగాడు దీపికవైపే మొగ్గుచూపి మిగతా ప్రశ్నలపై పడ్డాడట పాపం!

  • Loading...

More Telugu News