: నేడు బార్క్ ను సందర్శించనున్న మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముంబైలో పర్యటించనున్నారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ముంబైలో జరపనున్న పర్యటనలో భాగంగా మోడీ... బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్)ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా బార్క్ శాస్త్రవేత్తలతో భేటీ కానున్న ఆయన, సంపీడన నీటి రియాక్టర్, లార్జ్ స్కేల్ యాక్సిలరేటర్, భారీ స్థాయిలో న్యూక్లియర్ రీసైకిల్ ప్లాంట్ల ప్రగతి తదితర అంశాలపై శాస్త్రవేత్తలతో చర్చించన్నట్లు సమాచారం. భవిష్యత్తులో అణు రంగంపై ప్రభుత్వ ప్రణాళికలు, ఎలాంటి చర్యల ద్వారా భారత అణ్వస్త్ర రంగాన్ని పటిష్టం చేయాలి, ఈ రంగానికి సర్కారు కేటాయింపులు తదితర అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News