: విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి: బీవీ రాఘవులు


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దిశగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పయనించాలని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, స్థానికత అంశాన్ని నిర్దేశించేందుకు 1956ను ప్రాతిపదికగా తీసుకుంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగినంత కాలం నగర పరిధిలో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ లను భరించాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపైనే ఉందని ఈ సందర్భంగా రాఘవులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News