: ఐదేళ్ళూ పూర్తి చేసుకుంటా: మన్మోహన్ ధీమా


విపక్షాలు ఆయన్ని బలహీన ప్రధాని అంటాయి. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావంతో ఆయనే అలా అనిపించుకుంటారు! ఆయనను మేధావి అని ఎందరు అంటారో.. అంతకంటే ఎక్కువ మంది స్వంతగా నిర్ణయాలు తీసుకోలేని కీలుబొమ్మ అని అంటారు! ఇవన్నీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గురించే.

అయితే, ఆయన నేడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ళ పదవీకాలం పూర్తి చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, వరుసగా మూడోసారీ మీరే ప్రధాని కానున్నారా? అన్న ప్రశ్నకు జవాబు దాటవేశారు. ముందు ఈ పదవీకాలాన్ని పూర్తి కానివ్వండంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవి చేపట్టడాన్ని ఓ గౌరవంగా పేర్కొంటూ, అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు తన ప్రయత్నమని వివరించారు. నేడు ఓ జాతీయ వార్తా చానల్ షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ఇటీవల డీఎంకే శ్రీలంక సమస్యను సాకుగా చూపి యూపీఏ నుంచి వైదొలగిన నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం సమాజ్ వాదీ, బీఎస్ పీల మద్దతుపైనే ప్రధానంగా ఆధారపడింది. ముందస్తు ఎన్నికలు రావడం తథ్యమని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News