: రంజీల్లో ఆంధ్ర కెప్టెన్ గా కైఫ్!


ఫీల్డింగ్ లో మెరుపు వేగంతో కదలడంతో పాటు తనదైన శైలి బ్యాటింగ్ తో ఆకట్టుకున్న టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గుర్తున్నాడుగా? నిన్నటిదాకా రంజీల్లో యూపీ కెప్టెన్ గా వ్యవహరించిన ఈ స్టైలిష్ క్రికెటర్, ఇకపై ఆంధ్రా జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకోనున్నాడట. యూత్ ను ప్రమోట్ చేసే క్రమంలో కైఫ్ కు యూపీ వీడ్కోలు పలికింది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మెరుగైన రికార్డులున్న కైఫ్, ఆంధ్రా రంజీ క్రికెట్ అసోసియేషన్ తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడట. యూపీ ఉద్వాసన పలకడంతో తమను సంప్రదించిన కైఫ్ సేవలను వినియోగించుకునేందుకు ఆంధ్రా రంజీ అసోసియేషన్ కూడా సానుకూలంగానే స్పందించిందట.

  • Loading...

More Telugu News