: సీనియర్ జర్నలిస్టు బొబ్బిలి రాధాకృష్ణ మృతి


సీనియర్ జర్నలిస్టు బొబ్బిలి రాధాకృష్ణ (75) ఆదివారం గుండెపోటుతో మరణించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన కుమారుడి ఇంటిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 'ఈనాడు'లో విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగారు. ప్రస్తుతం 'కాకతీయ' అనే పత్రికలో పనిచేస్తున్నారు. రాధాకృష్ణ మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News