: క్రికెట్ ఎక్కడుంటే.. బెట్టింగ్ అక్కడ..
క్రికెట్ ఎక్కడుంటే బెట్టింగ్ అక్కడుండడం పరిపాటిలా మారింది. ఇక రసవత్తర పోటీలకు కేరాఫ్ లా మారిన ఐపీఎల్ పై బెట్టింగ్ రాయుళ్ళ కన్ను పడకుండా ఉంటుందా!? తప్పకుండా పడుతుంది. ఎంతలా అంటే, తొలి ఎడిషన్ లో రూ. 6000 కోట్లు ఉన్న బెట్టింగ్ కాస్తా ఆరో సీజన్ వచ్చేసరికి రూ. 40,000 కోట్లకు చేరింది. గత సీజన్ కంటే 25 శాతం వృద్ధి కనిపిస్తోందట. దీన్ని బట్టి చూస్తే, చట్టబద్ధంగా చేసే వ్యాపారాలు కూడా ఈ అక్రమదందా ముందు దిగదుడుపేననిపిస్తోంది. అయితే, గతంలో పోలిస్తే ఈసారి ఐపీఎల్ లో బెట్టింగ్ కు ఉద్యోగులు ఎక్కువగా పాల్పడుతున్నారట. ఓ సర్వేలో వెల్లడైన వాస్తవమిది.
కాగా, ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలన్నీ కూడా పోర్చుగల్ నుంచి కొనసాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలావుంటే, మన హైదరాబాద్ నగరం ఐపీఎల్ బెట్టింగ్ కు రాజధానిలా బాసిల్లుతోందట. 20 శాతం పందెం రాయుళ్ళు ఇక్కడి నుంచే తమ వ్యాపారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.